భోజనం తర్వాత ఈ పండ్లు తింటున్నారా.? అయితే ప్రమాదంలో పడినట్లే..
TV9 Telugu
09 February 2024
కొందరు నిమ్మజాతి పండ్లైన బత్తాయి, ఆరెంజ్ వంటి పండ్లు భోజనం తర్వాత తింటూంటారు. నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.
సిట్రస్ పండ్లలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అంటున్నారు పోషకాహార నిపుణలు.
ఇవి జీర్ణక్రియలో అజీర్ణం, ఆమ్లత్వం, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు నిపుణులు.
మధుమేహం వంటి ఆరోగ్య సమస్యల ముప్పు ఉన్నవారికి భోజనం తరువాత ఈ పండ్లు తీసుకోవడం సమస్య పెంచుతుందని అన్నారు.
భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్లను తినడం వల్ల కొంతమందికి కడుపులో గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి ఏర్పడుతుంది.
సిట్రస్ పండ్ల ఆమ్లత్వం కొన్ని పోషకాలను, ముఖ్యంగా ఐరన్ గ్రహించకుండా నిరోధించే ప్రమాదం ఉందని అంటున్నారు.
సిట్రస్ పండ్లలో పాలీఫెనాల్స్, ఆక్సలేట్లు వంటి కొన్ని సమ్మేళనాలు శరీరం పోషకాలను గ్రహించకుండా చేసే ప్రమాదం ఉంది.
అందుకే భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్లు తీసుకోకుండా ఉంటే బెటర్ అన్నది పోషకాహార నిపుణుల, వైద్యుల మాట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి