టీతోపాటు బిస్కెట్లు తింటే అంతే సంగతులు..
17 October 2023
టీతోపాటు బిస్కెట్లు తినే అలవాటు ఉంటే మాత్రం మానుకోవాలంటున్నారు. లేదంటారా అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.
బిస్కెట్లు ప్రాసెస్ చేసిన ఆహారంగా భావిస్తారు. ఇందులో ఉండే BHA, BHT పదార్థాలు DNA మీద ప్రభావం చూపిస్తుంటాయి.
టీతో పాటు బిస్కెట్లు తిన్నట్లయితే బీపీ పెరిగే ప్రమాదం పొంచి ఉంది. హైపర్‌టెన్షన్ సమస్య వచ్చే ముప్పు అనేక రెట్లు పెరుగుతుంది.
బిస్కెట్లలో ఎక్కువగా ఉండే సోడియం కంటెంట్ కారణంగా హైపర్‌టెన్షన్ ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక్కసారి హైపర్‌టెన్షన్ పెరిగినట్లయితే జీవితాంతం గుండెను పదిలంగా చూసుకోవాల్సి ఉంటుంది. హైపర్‌టెన్షన్‌తో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
టీలోనూ, బిస్కెట్‌లోనూ చక్కెర ఉంటుంది. చక్కెర అధికంగా తీసుకుంటే.. ఇన్సులిన్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఇది డయాబెటిస్‌కు కారణం కావచ్చు.
బిస్కెట్ తయారీలో వాడే శుద్ధి చేసిన ఆహార పదార్థాల కారణంగా జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మలబద్ధకం సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కూడా వాడుతుంటారు. ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి