ఇలా నీరు తాగితే ప్రమాదం మీ చెంతనే..

TV9 Telugu

04 June 2024

సాధారణంగా తక్కువ నీరు తాగే వారికి కిడ్నీ స్టోన్ సమస్యలు వస్తాయని అందరికి తెలిసిన విషయమే. అందుకే నీరు ఎక్కువగా తీసుకోవాలి.

ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. దీంతో అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు.

అయితే నీరు ఎలా తాగాలి అనేది కూడా తెలుసుకోవడం కూడా చాల ముఖ్యమని అంటున్నారు పోషకాహార, ఆరోగ్య నిపుణులు.

కొంతమంది నిలబడి నీరు తాగుతుంటారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

నిలబడి నీరు త్రాగడం మొత్తం జీవ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో ఆస్పిరేషన్ న్యుమోనియా ఊపిరితిత్తులలోకి ప్రవేశించవచ్చు.

నిలబడి నీరు త్రాగితే కడుపుపై ​​ఒత్తిడి పడి శరీరంలోని మలినాలను మూత్రాశయంలో నిక్షిప్తం చేస్తాయి. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.

కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఎప్పుడూ హాయిగా కూర్చుని నీళ్లు తాగాలి. నెమ్మదిగా నీటిని సిప్ చేసి త్రాగాలి.

నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు వేగంగా లోపలికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయే అవకాశం ఉంది. అది ఊపిరితిత్తుల వ్యాధికి దారి తీస్తుంది.