చక్కెర పానీయాలతో జర భద్రం!
TV9 Telugu
15 April 2024
మనలో చాలా మంది ఫిట్‌నెస్ ప్రియులు వర్కవుట్లు చేస్తూ సెలబ్రిటీలు, పోషకాహార నిపుణుల సూచించే డైట్‌ను ఫాలో అవుతుంటారు.
మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నవాళ్లు చక్కెరలు అధికంగా ఉన్న రంగురంగుల డ్రింక్స్ తాగుతూ ఉల్లాసంగా కనిపించే యాడ్స్ టీవీల్లో ఊదరగొడుతుంటాయి.
వ్యాయామం చేసినంత మాత్రాన అధిక చక్కెరలు ఉన్న పానీయాలు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పరిశోధకులు.
వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామం తప్పనిసరి అయినట్లే వారంలో రెండుసార్లకు మించి చక్కెరలు ఎక్కువగా ఉండే పానీయాలు సేవిస్తే ప్రమాదం
వ్యాయామంతో సంబంధం లేకుండా గుండె రక్తనాళాల వ్యాధి ముప్పు ఎక్కువేనని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనలో తేలింది.
కార్బొనేటడ్ డ్రింక్స్‌లో 8 నుంచి 10 స్పూన్ల చక్కెర ఉంటుందే తప్ప వేరే ఎలాంటి పోషకాలు ఉండవు. ఇది కేవలం తాత్కాలిక శక్తిని మాత్రమే అందిస్తుంది.
వ్యాయామం చేసే వారు హై షుగర్, హై ఎనర్జీ డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయంగా ఇంట్లో చేసుకునే పళ్లరసాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చక్కెర శీతల పానీయాలు తాగడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్ వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి