ఎండకు తట్టుకోలేక చెరకురసం తాగుతున్నారా..? యమ డేంజర్!

TV9 Telugu

29 March 2024

వేసవిలో చెరకు రసం తాగడం మంచిది. వాటిలోని పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చెరకు రసం ఎక్కువగా తాగడం ప్రమాదకరం.

ఒక గ్లాసు చెరుకు రసంలో అధికంగా 250 కేలరీలు, అధికంగా 100 గ్రాముల చక్కెర ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తెలిసింది.

అందుకే చెరకు రసం అధికంగా లేదా ప్రతిరోజూ తాగుతూ ఉంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే చెరుకురసం తాగడం హానికరమని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరం ఉందన్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు.

చెరకు రసంలో పోలికోసనాల్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది బ్లడ్ థినర్ గా పనిచేసి శరీరంలో రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటుంది.

కానీ కొన్నిసార్లు ఇది మనకు ప్రమాదకరం. ఎందుకంటే మనం గాయపడినప్పుడు, అది రక్తస్రావం పెరగడానికి దారితీస్తుంది.

కామెర్లకు అద్భుతమైన ఔషధం చెరకు రసం. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి.

మనకు కామెర్లు వచ్చినప్పుడు ప్రోటీన్ పెద్ద పరిమాణంలో విచ్ఛిన్నమవుతుంది. బైలిరుబిన్ స్థాయిని నియంత్రించడానికి చెరకు రసం సహాయపడుతుంది.