బెడ్ టీ తాగితే ప్రమాదం మీ వెంటనే..

TV9 Telugu

23 July 2024

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి టీ తాగడం వల్ల పొట్ట లోపలి భాగం దెబ్బతింటుంది. ఇది అల్సర్లకు దారితీస్తుంది.

ఉదయాన్ని ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో చక్కెర పెరుగుతుంది. ఫలితంగా బరువు పెరుగుట, ఊబకాయం ఏర్పడుతుంది.

ఖాళీ కడుపుతో ప్రతిరోజూ కప్పుల కొద్దీ టీ తాగడం వల్ల స్కెలెటల్ ఫ్లోరోసిస్ వంటి వ్యాధి వస్తుంది. దీనివల్ల ఎముకలు లోపల బోలుగా మారుతాయి.

టీ తాగడం వల్ల తాజాదనం వస్తుందని చెబుతారు. ఉదయాన్నే పాలతో టీ తాగడం వల్ల పనిలో అలసట, చికాకులు కలుగుతాయన్నది నిజం.

నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడి జీర్ణక్రియ మందగిస్తుంది. వికారం, చంచలతను పెంచుతుంది.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో కెఫిన్ వేగంగా పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచి గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఉదయం లేచిన వెంటనే టీ తాగితే శరీరంలో కెఫిన్  పెరిగి నిద్రలేమితో పాటు ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడవచ్చు.

ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటే, ఖాళీ కడుపుతో టీ తాగే బదులు, దానితో పాటు బిస్కెట్ లేదా చిరుతిండిని తీసుకోండి.