ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతున్నారా..? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడుతున్నట్టే..

18 November 2023

బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.

శ‌క్తి హీన‌మై, బ‌రువు పెరిగి ప్రీ డ‌యాబెటిస్ ప‌రిస్దితికి దారితీసే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మూడు ఆహార ప‌దార్ధాల‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే శ‌రీరానికి ప్రమాదకరమని వారు సూచిస్తున్నారు.

చాయ్ బిస్కెట్‌, బ్రేక్‌పాస్ట్ సిర‌ల్స్‌, ఫ్రూట్ జ్యూస్‌ల‌తో రోజును ప్రారంబిస్తే దీర్ఘ‌కాలంలో షుగర్‌ వ్యాధి ముప్పు పొంచి ఉంటుంది.

టీ, కాఫీలు, ఫ్రూట్ జ్యూస్‌లు, సిరిల్స్‌, ఎన‌ర్జీ బార్స్‌ ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్ పెరిగేందుకు దోహదం చేస్తాయి.

కేఫిన్ అధికంగా ఉండే టీ, కాఫీల‌ను కొద్దిగా తీసుకున్నా ర‌క్తంలో గ్లూకోజ్‌ 50 శాతం వ‌ర‌కు పెరిగే ప్రమాదం ఉంది.

రోజూ లేవ‌గానే గోరువెచ్చ‌టి నీటిని తాగాలని సూచిస్తున్నారు. శ‌క్తి కోసం నీటిలో నాన‌బెట్టిన న‌ట్స్‌, సీడ్స్‌ను తీసుకోవాలి.

అల్పాహారంగా స్ప్రౌట్స్‌, ఎగ్స్, కూర‌గాయ‌లు వంటి ప్రొటీన్‌, ఫైబ‌ర్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.