చాలాసేపు వర్కవుట్ చేస్తున్నారా.. ప్రమాదాన్ని హాగ్ చేసుకొన్నట్టే..
TV9 Telugu
03 May 2024
వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా ప్రతి వారం కేవలం 75 నిమిషాల వ్యాయామం చేస్తే మీ శరీరం ఖచ్చితంగా ఫిట్‌గా ఉంటుంది.
శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పరిమిత సమయం వరకు వ్యాయామం చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
మీరు కూడా జిమ్ చేస్తే, కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. తద్వారా వ్యాయామం మీ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
చాలమంది ప్రజలు తమ శరీరంలో కండరాలు లేదా అబ్స్ కోసం లేదా బరువు తగ్గడానికి ఎక్కువ సమయం వ్యాయామం చేస్తుంటారు.
మీరు శరీరంలో శీఘ్ర ప్రయోజనాలను పొందడానికి గంటల వర్కవుట్‌లు చేయడం ప్రాణాంతకమని తాజా నివేదికలో వెల్లడైంది.
ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల బీపీ అధికం కావడం, కండరాలు పట్టేయడం, ఎముకలు బలహీనపడడం వంటి సమస్యలు వస్తాయి.
అతిగా వ్యాయామం చేస్తే శరీరంలో చురుకుదనం పోయి అలసట వస్తుంది. శరీరం ఫిట్‌గా ఉండాలంటే 40-45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుంది.
అధిక సమయం వర్కవుట్ చేస్తే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రక్తపోటు, కీళ్ల నొప్పుల పెరుగుతాయి. మెదడులో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి