క‌ఠిన వ్యాయామం చేస్తున్నారా.. ఇది మీ కోసమే..

26 November 2023

అగ్నిమాప‌క సిబ్బందిలో వ్యాయామం అనంత‌రం 4700 ఫ్లూయిడ్ అణువుల‌ను విశ్లేషించిన మీద‌ట ఈ నిర్ణయానికొచ్చారు.

అధ్యయన వివరాలు జ‌ర్న‌ల్ మిల‌ట‌రీ మెడిక‌ల్ రీసెర్చ్ జ‌ర్న‌ల్‌లో పబ్లిష్‌ అయ్యాయి. క‌ఠిన‌ వ్యాయామ శిక్ష‌ణ చేస్తున్న వ్య‌క్తుల‌కు తాజా అధ్యయనం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

అధిక ఫిట్‌నెస్ లెవెల్స్ క‌లిగిన వ్య‌క్తులు క‌ఠిన వ్యాయామం అనంత‌రం వైర‌ల్ రెస్పిరేట‌రీ ఇన్ఫెక్ష‌న్స్ బారిన పడే ప్రమాదం ఉంది.

ఈ విషయాన్ని ప‌సిఫిక్ నార్త్‌వెస్ట్ నేష‌న‌ల్ లేబరేట‌రీకి చెందిన బ‌యోమెడిక‌ల్ సైంటిస్ట్ ఎర్నెస్టో న‌క‌య‌సు చెప్పారు.

ఓ మోస్త‌రు శారీర‌క శ్ర‌మ‌తో దీర్ఘ‌కాలంలో రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ‌పై సానుకూల ప్ర‌భావం ఉంటుంది. క‌ఠిన వ్యాయామం రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్ధ‌పై త‌క్ష‌ణ‌మే ప్ర‌తికూల ప్ర‌భావం ఉంటుంది.

అధ్య‌య‌నంలో భాగంగా 11 మంది అగ్నిమాప‌క సిబ్బంది క‌ఠిన వ్యాయామం చేసే ముందు, అనంత‌రం వారి బ్ల‌డ్ ప్లాస్మా, యూరిన్‌, స‌లీవాను టెస్ట్‌ చేశారు.

ఫైర్ ఫైట‌ర్స్ ద్ర‌వాలు, ఆక్సిజ‌న్‌, ఎన‌ర్జీ లెవెల్స్‌తో పాటు వాపు సంబంధిత అణువుల్లో త‌గ్గుద‌ల‌ను గుర్తించారు.

కాలుష్యంలో పని చేసే అగ్నిమాప‌క సిబ్బందిపైనే కాకుండా ఇతరులపైనా పరిశోధనలు చేయాలనే వాదనలు బలపడుతున్నాయి.