డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ఆ సమస్యలు తప్పవు..
TV9 Telugu
14 July 2024
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ అతిగా తింటే అనేక వ్యాధులకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
డ్రై ఫ్రూట్స్ ఫైబర్‌కు మంచి మూలం. కానీ, డ్రైఫ్రూట్స్‌ఎక్కువగా తింటే మాత్రం అనేక వ్యాధులకు కారణమవుతుంది.
డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం మధుమేహ రోగులకు చాలా ప్రమాదకరమని చెపుతున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు.
డయాబెటిక్ సమస్య ఉన్న రోగులు ఎక్కువ పరిమాణంలో డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుంది.
డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు, ఇతర పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి.
డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలో తినండి.
ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ ను మూడు నెలలు మాత్రమే తినాలి. తర్వాత కాస్త గ్యాప్ తీసుకోని మళ్లీ తినాలి.
డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీని వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి