వెల్లుల్లి అధిక వినియాగిస్తున్నారా.? ప్రమాదం మీ చెంతనే..

TV9 Telugu

23 June 2024

వెల్లుల్లి భారతీయ వంటశాలలలో ఎక్కువగా ఉపయోగించే మసాలా. దీన్ని వంటకాలకు జోడించడం వల్ల చాలా రుచి వస్తుంది.

వెల్లుల్లిని ఆయుర్వేదం నిధిగా పరిగణించినప్పటికీ, మీరు దానిని ఎక్కువగా తింటే మీరు కొంత హానిని కలిగే అవకాశం ఉందంటున్నారు పోషకాహార నిపుణులు అంటున్నారు.

వెల్లుల్లి వేడి చేస్తుంది. అందుకే జలుబు సంబంధిత వ్యాధులలో వెల్లుల్లిని ఎక్కువగా తింటారు. కానీ కొందరు దీనిని అతిగా తీసుకోవడం మొదలుపెడతారు.

కానీ దీనివల్ల నోటి దుర్వాసన వస్తుంది. అందుకే దానిని పరిమిత పరిమాణంలో తినలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

తక్కువ రక్తపోటు ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మరింతగా తగ్గించే అవకాశం ఉంది. ఇది శరీరంలో బలహీనత, అలసటకు దారితీస్తుంది

వెల్లుల్లిని నిర్దేశించిన దానికంటే ఎక్కువగా తింటే గుండె మంట సమస్య వస్తుంది. నిజానికి వెల్లుల్లిలో ఆమ్ల సమ్మేళనాలు ఉంటాయి.

ఎక్కువ తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఒక్కోసారి తట్టుకోలేనంతగా ఉంటుంది. నోట్‌ - ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాయి. దీనిని అనుసరించే ముందు నిపుణులను సంప్రదించండి. లేదంటే సమస్యలు తప్పవు.