ఈ లక్షణాలు గుండెకు డేంజర్‌ బెల్స్‌.. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..

03 September 2023

కొలెస్ట్రాల్ శరీరంలో అవసరానికి మించి పేరుకుపోతే చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. మంచి ఆహారం, శారీరక శ్రమ, వ్యాయామం వంటి వాటితో అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు.

మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతున్నట్టు సిగ్నల్స్‌ వస్తుంటాయి. లక్షణాలను పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం ఎమర్జెన్సీకి దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు.

బాడీలో కొలెస్ట్రాల్‌ ఎక్కవ అయితే గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోయినప్పుడు కొన్ని లక్షణాల మాత్రం కనిపిస్తాయంటున్నారు నిపుణులు

కొలెస్ట్రాల్ ఎఫెక్ట్‌ ఎక్కువగా నరాల మీద పడుతుది. దీంతో చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు రావడం జరుగుతుంది. కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరగక ఇలా తిమ్మిర్లు వస్తుంటాయి.

కొలెస్ట్రాల్ ఎక్కువయిన వారిలో శ్వాస సంబంధిత లక్షణాలు బయటపడతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇది హృద్రోగ సంబంధిత సమస్యలకు సంకేతం అంటున్నారు వైద్యులు.

ముఖ్యంగా చెస్ట్‌ ప్రాంతంలో ఏదో పట్టేసినట్టు అన్‌ ఈజీగా ఉంటుంది. దీన్ని ఆంజీనా అని కూడా అంటారు. అధిక కొలెస్ట్రాల్ అనేది కరొనరీ ఆర్టరీ వ్యాధి ఉన్న వారిలో ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది.

రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కండరాలకు రక్త సరఫరాలో తేడా వస్తుంది. ఫలితంగా తీవ్ర అలసటకు దారి తీస్తుంది. కాస్త పని చేయగానే లేదా నడవగానే నీరసించి పోతుంటారు.

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కంటి చూపుపై తీవ్ర ఎఫెక్ట్‌ పడుతుంది. రక్తనాళాల నుంచి కళ్ళకు రక్త సరఫరా సాఫీగా జరగదు. చూపు మందగిస్తుంది. దృష్టి లోపం సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.