వీడియో గేమ్‌ల సౌండ్ తో చెవుడు  ప్రమాదం..

TV9 Telugu

02 February 2024

వీడియో గేమ్స్‌ శబ్దంతో చెవుడు ప్రమాదం. అదే పనిగా వీడియో గేమ్స్‌ ఆడేవారికి చెవుడు రావచ్చని నిపుణులు అంటున్నారు.

చెవుల్లో నిరంతరం గిర్రుమంటూ శబ్దం వినిపించే వ్యాధి (టైనిటస్‌) బాధించవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఈ విషయం ప్రముఖ బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో కొత్తగా ప్రచురితమైన ఓ అధ్యయనంలో వెల్లడైందని తెలుస్తోంది.

మొబైల్ లేదా లాప్ టాప్ లో వీడియో గేమ్స్‌ ఆడేటప్పుడు హెడ్‌ ఫోన్లు, ఇయర్‌ బడ్స్‌లలో శబ్దాలు మరింత తీవ్రంగా ఉంటాయి.

2022లో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లమంది వీడియో గేమ్స్‌ ఆడారు. బాలబాలికల్లో 20 నుంచి 68 శాతంమంది వీడియో గేమ్‌ ఆడేవారే.

వారానికి 40 గంటలసేపు 75 డెసిబెల్స్‌తో సమానమైన లేక అంతకన్నా ఎక్కువ శబ్దాలు వింటే శ్రవణ సమస్యలు వస్తాయి.

వారంలో ఆరున్నర గంటలసేపు 83 డెసిబెల్స్‌ (డీబీ) శబ్దాలు విన్నా ప్రమాదం ఉండదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

9 దేశాలలో 50,000 మందిపై జరిగిన అధ్యయనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాలోని సౌత్‌ కరోలినా విశ్వవిద్యాలయ పరిశోధకులు పాల్గొన్నారు.