కొబ్బరి నూనెతో మెరిసే చర్మం..
TV9 Telugu
07 July 2024
కొబ్బరినూనెలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లినోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
కొబ్బరి నూనె వినియోగం వల్ల మీ చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పని చేసి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
ఇది రోజూ రెండు చుక్కల ముఖం, మెడకి రాస్తే స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది. ఎల్లప్పుడూ వర్జిన్ కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించుకోవాలి.
కొబ్బరి నూనెను రోజూ ముఖానికి రాయడం వల్ల మీ ఫేస్ పై ఉన్న నల్లమచ్చలకు కొద్దిరోజుల్లో చెక్ పెట్టవచ్చు.
రోజూ కొబ్బరినూనె రాయడం వల్ల చర్మం టోన్ తెలికపడుతుంది. అలాగే దీని వినియోగం అనేక చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
కొబ్బరి నూనె రోజూ రాసుకోవడం వల్ల చర్మం నల్లగా అవుతుందని, కొందరు అంటూంటారు కానీ ఇది కేవలం అపోహ మాత్రమే.
కొబ్బరి నూనెను పొడి, సాధారణ చర్మం ఉన్న వాళ్లు మాత్రమే ఉపయోగించాలి. జిడ్డులాగా చర్మం ఉన్న వాళ్లు రాయకూడదు.
కొబ్బరి అంటే అలర్జీ ఉన్నవారికి కొబ్బరి నూనెతో కూడా అలర్జీ రావచ్చు. సున్నితమైన చర్మ ఉన్న వారు కూడా కొబ్బరి నూనెను ఉపయోగించడం హానికరం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి