బాదం ను ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ నిరోధించవచ్చు. బాదంని మెత్తగా రుబ్బి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. అందులో కొన్ని పాలు కలపాలి.
ఈ పేస్ట్ ను కళ్ల కింద అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
రాత్రి పడుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. డార్క్ సర్కిల్స్ ను దూరం చేయడానికి వాటిపై కొద్దిగా బాదం నూనెను రాసుకోవాలి.
మరుసటి రోజు ఉదయం లేవగానే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డార్క్ సర్కిల్స్ ను దూరం చేసి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.
కీరదోసకాయ చర్మానికి చాలా లాభదాయకమైనది . డార్క్ సర్కిల్స్ ను తొలగించాలంటే కీరదోస రసాన్ని నిమ్మరసంతో మిక్స్ చేసి కళ్ల కింద అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది.
డార్క్ సర్కిల్స్ నుంచి బయటపడాలంటే రోజ్ వాటర్ లో పెరుగు, నిమ్మరసం మిక్స్ చేయాలి . దీన్ని కంటి చుట్టూ వలయాల మీద అప్లై చేయాలి.
ఈ పేస్ట్ ఎండిపోయిన తర్వాత మళ్లీ కడిగి మళ్లీ అప్లై చేసి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇది డార్క్ సర్కిల్స్ ను పోగొడుతుంది.