ప్రతికూల ఆలోచనలకు ఇలా చెక్ పెట్టండి..

యంత్రానికైనా కాసేపు బ్రేక్ ఉంటుందేమో కానీ, మనిషి బ్రెయిన్‌కు మాత్రం బ్రేక్ ఉండదు.

నిత్యం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. 

ఇందులో సానుకూల, ప్రతికూల ఆలోచనలు ఉంటాయి. ఇవి వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ప్రతికూల ఆలోచనలు వ్యక్తి వ్యక్తిత్వానికి సమస్యగా మారే అవకాశం ఉంది.

ప్రతికూల ఆలోచనల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

ప్రతికూల ఆలోచనలను నివారించడానికి ‘నోట్స్ రాయడం’ అలవాటు చేసుకోవాలి.

కొత్త అలవాట్లను అలవరచుకోవాలి.

ఎక్కువగా మీకు ఇష్టమైన పనులు చేయాలి. ఇది ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తుంది.

రోజూ వ్యాయామం చేయాలి.