నల్లులు పరుపులు, దిండ్లు, సోఫాలు, కుర్చీల్లో దాక్కుని రాత్రిపూట మనిషి శరీరం నుండి రక్తాన్ని పీలుస్తూ తమ ప్రతాపాన్ని చూపిస్తుంటాయి.
రైలు, విమానం లేదా బస్సు లో ప్రయాణించే సమయంలో కూర్చున్న సీట్ లో నల్లులు ఉంటే అవి మీతో పాటు మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
నల్లులు మన శరీర ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నల్లులను చూడగానే భయపడే అతి సున్నిత మనస్కులు షాక్ కి గురవ్వడం వల్ల రక్త పోటు అనూహ్యంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది.
నల్లులు కుట్టినప్పుడు విపరీతంగా దురద, మంట ఉంటుంది. చేతులతో గోకినప్పుడు క్రిమికీటకాలు మీ శరీరంలోకి ప్రవేశించి అంటురోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటున్నారు.
నల్లులు వాటి చర్మాన్ని, మలమూత్రాలను ఇంటిలోనే కానిచ్చేయడం వల్ల ఇంట్లో ఉన్న గాలి విషతుల్యంగా మారుతుంది.
ఆస్త్మా తో పాటు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడేవారు నల్లుల వల్ల మరిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
గదిలో ఎక్కువ నల్లులు ఉంటే నిద్రాభంగం కలుగుతుంది. రాత్రంతా మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిద్రలేమి మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.