ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు మస్ట్‌

21 September 2023

వినాయక చవితి వచ్చిందంటేనే తొమ్మిది రోజులు పండగ హడావుడి ఉంటుంది. నవరాత్రి పూజలు చేస్తూ భక్తులు ఉపవాసాలు పాటిస్తుంటారు.

ఉపవాసం  ఉండే వారు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు  హెచ్చరిస్తున్నారు.

ఉప‌వాసం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు, కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

ఉపవాసం ద్వారా శ‌రీరం డీటాక్సిఫికేష‌న్ అవ‌డంతో పాటు బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవ‌డం, జీవ‌క్రియల వేగం పెరుగుతుంది.

కొన్ని రకాల అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా ఉండాలంటే ఉప‌వాసం చేయ‌డం మేల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

పండుగ‌ల సమ‌యంలో చేసే ఉప‌వాస సమయంలో ఎంపిక చేసుకునే ఆహార ప‌దార్ధాల విష‌యంలో జాగ్ర‌త్తలు పాటించాలని నిపుణులు అంటున్నారు.

ఉపవాసం దీక్షకు మందు, ఉవాసం ముగిసిసన తర్వాత ప్రొటీన్‌ అధికంగా ఉండే అహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోజంతా అలసిపోకుండా ఉండేందుకు బాదం, ప‌నీర్, క‌ర్డ్‌, న‌ట్స్ వంటివి ఉపవాసం దీక్షకు ముందు ద్రవ రూపంలో తీసుకుంటే మేలు.

బాదంలో ఉండే ప్రొటీన్ గుండె ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు చ‌ర్మం మెరిసేందుకు, మ‌ధుమేహ నియంత్ర‌ణ‌కు బాదం చాలా బాగా పని చేస్తుంది.

ఉప‌వాసం దీక్ష విర‌మించే సమయంలో ముందుగా మంచి నీరు తాగి, ఆ తర్వాత తేలిక‌పాటి ప్రొటీన్లు, ఫైబ‌ర్‌, ఆరోగ్య‌క‌ర కొవ్వుల‌తో కూడిన స‌మ‌తులాహారం తీసుకుంటే మేలు.

పండుగ వేళ స్వీట్లు ఎక్కువగా తింటే రక్తంలో షుగ‌ర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఉపవాస స‌మ‌యంలో శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురికాకుండా జాగ్రత్తపడాలి.