చలికాలంలో కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
TV9 Telugu
15 January 2024
చలికాలంలో వెచ్చదనం కోసం చాలామంది కాఫీలు, టీలు, బేకరీ ఆహారాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకుంటారు.
వీటిని తీసుకోవడం వల్ల కాలేయంలో అధికశాతం కొవ్వు పేరుకుని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యకు దారితీస్తుంది.
అంతేకాదు.. లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.
చలికాలంలో వ్యాయామం, వాకింగ్ చేయడానికి బద్దకిస్తుంటారు. శరీరంలో చురుకుదనం తగ్గిపోయి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, షుగర్ జబ్బు వచ్చే ప్రమాదం ఉంది.
వేసవి కాలంతో పోలిస్తే చలికాలంలో నీరు చాలా తక్కువగా తాగుతారు. శరీరంలో నీటి శాతం తక్కువ, చక్కెర శాతం ఎక్కువ ఉండటం వల్ల కూడా కాలేయ సమస్యలు వస్తాయి.
శుద్ది చేసిన చక్కెర, అధిక ఫ్రక్టోజ్ కలిసి కొవ్వుగా మారి ఫ్యాటీ లివర్ వ్యాధికి దారి తీస్తుంది. ఈ సమస్య రాకూడదంటే వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి.
రోగనిరోధక శక్తిని బలహీన పరిచే చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను తినడం మానుకోవాలి. తాజా పండ్లను, కాలేయాన్ని శుద్దిచేసే ఆహారాలు తీసుకోవాలి.
మధుమేహం ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు చెక్ చేసుకుంటూ ఉండాలి. సోడా, కేకులు, స్వీట్లు, మైదా, నూనె పదార్థాలు, డీప్ ఫ్రై ఆహారాలు మానుకోవాలి.