చలికాలంలో కాలేయాన్ని కాపాడేందుకు జాగ్రత్తలు..
15 December 2023
క్రిస్‌మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో కేక్స్, బర్గర్లు, పిజాల వంటి హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటారు.
బరువు పెరగడం, కడుపుబ్బరం, వికారం, మలబద్ధకం బారిన పడుతుంటారు. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ వంటి కాలేయ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.
పండగ సీజన్‌లో మద్యం, చక్కెర, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం అతిగా తీసుకుంటే కాలేయంపై ఎఫెక్ట్ ఉంటుంది.
అలాగే మద్యం తీసుకునే ముందు దాహం తీర్చుకునేందుకు ఒకట్రెండు గ్లాసుల మంచినీరు తాగితే మేలంటున్నారు నిపుణులు.
సాధారణంగా మద్యం సేవించడం ద్వారా శరీరంలో బీ విటమిన్లు, సీ విటమిన్, మెగ్నీషియం వంటి పోషకాలు కోల్పోతారు.
రోజూ మద్యం సేవించే వారిలో హై కార్బోహైడ్రేట్ కంటెంట్‌తో బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.
మద్యం అలవాటు ఉన్న వారు దాన్ని సేవించే ముందు గుడ్లు, ఫిష్, చికెన్, మాంసం, డైరీ ఉత్పత్తులు, పప్పుధాన్యాల వంటి ఆహారం తింటే కొంత మేర మంచిది
ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయడం ద్వారా కాలేయానికి ముప్పు తలపెట్టే కొవ్వును తగ్గించుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి