ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ గుండె ఆరోగ్యం పదిలం..

ప్రస్తుత కాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు శరీరం కేంద్రంగా మారుతుంది.

వాటిలో గుండె సమస్యలు ప్రధానమైనవి.

గుండె సమస్యల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పడు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.

గుండె ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తరచు తినాలి.

తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఆహారంలో ఉప్పు వినియోగం తగ్గించాలి.