దీపావళి రోజున ఆహారం విషయంలో జాగ్రత్తలు..
08 November 2023
మరికొద్ది రోజుల్లో దీపావళి రాబోతుంది. పండగలంటే పూజలు, ఆధ్యాత్మికతే కాదు నోరూరించే ఘుమఘుమలూ ప్రత్యేకమే.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కలిసి ఇష్టమైన వంటకాలను ఆరగిస్తూ దీపావళి పండగను సంతోషంగా చేసుకుంటాం.
ఎలాగూ పండగ కదా అని ఇష్టమైన వంటకాలన్నీ అతిగా ఆరగిస్తే మాత్రం సమస్య తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పండగపూట అతిగా ఆరగించడం వల్ల కడుపుబ్బరం, వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కొంటారని అంటున్నారు.
దీపావళి పార్టీలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.
కార్బొనేటెడ్ డ్రింక్స్, స్పైసీ ఫుడ్, బీన్స్, సాల్టీ స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్లను పండగపూట ఎక్కువగా తీసుకోవద్దు.
ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండే పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
ఇవే కాకుండా మరికొన్ని ఆహార పదార్ధాలను ఎంపిక చేసుకోవడం ద్వారా దీపావళి పండగను సంతోషంగా ఆస్వాదించవచ్చు.
ప్రొ బయాటిక్ ఫుడ్, హెర్బల్ టీలు తీసుకోవడంతో పాటు తగినంత నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి