దీపావళి సమయంలో స్వీట్స్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..

11 November 2023

దీపావళి కారణంగా గెట్ టు గెద‌ర్‌లు, పార్టీల హ‌డావిడితో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సంతోషంగా పండగ జరుపుకుంటారు.

దీపావళి పండ‌గ రోజుల్లో స్వీట్స్‌, దేశీ స్నాక్స్‌ వంటి వంటకాలతో ప్రతీ ఇంటి నుంచి ఘుమఘుమలు వస్తుంటాయి.

పండగ పూట పిల్లల నుంచి పెద్దల వరకు స్వీట్స్‌, స్నాక్స్‌ తినడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. అధిక క్యాల‌రీలు, కొవ్వు ప‌దార్ధాలు ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి.

కొవ్వు పదార్థాలు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు బదులుగా ఆరోగ్య‌క‌ర ప్ర‌త్యామ్నాయాలు ఎంపిక చేసుకోవాలి.

వంటకాల విషయంలో జాగ్ర‌త్త‌గా లేకుంటే హై క్యాల‌రీ ఆహ‌రంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తాయి. కొద్దిపాటి జాగ్ర‌త్త‌ల‌తో దిపావళి స్వీట్స్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

ఖీర్‌, షిర్‌ఖండ్ వంటి పాల‌తో చేసిన డెజెర్ట్స్ తీసుకోవడం మేలు. చక్కర స్ధానంలో డేట్స్‌, కిస్‌మిస్‌, తాజా పండ్ల‌తో పాటు కొద్దిమోతాదులో బెల్లం, తేనెను వాడితే బెటర్‌.

ర‌వ్వ ల‌డ్డు, కొబ్బరి ల‌డ్డుకు బ‌దులు ప్రొటీన్ అధికంగా ఉండే శ‌న‌గ‌పిండితో చేసిన ల‌డ్డూ, వేరుశ‌న‌గ ల‌డ్డూ, మైసూర్ పాక్‌ను తయారు చేసుకోవచ్చు.

బ‌య‌ట స్వీట్ షాప్స్‌లో స్వీట్స్‌ను కొనుగోలు చేయ‌కుండా ఇంట్లోనే త‌యారు చేసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.