చలికాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు..

09 December 2023

చ‌లికాలంలో వేడివేడిగా ఇష్ట‌మైన ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు.

చలికాలంలో క‌డుపుబ్బ‌రం, వికారం, మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి వంటి జీర్ణ సంబంధ స‌మస్య‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అధికంగా షుగ‌ర్‌, ఆల్క‌హాల్ వినియోగం ఈ స‌మస్య‌ల‌ను మ‌రింత ముదిరేలా చేస్తుంది. అనారోగ్య‌క‌ర ఆహారం అధిక వినియోగం పేగులు అనారోగ్యం బారిన పడతాయి.

పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా త‌గ్గ‌డం వల్ల ప‌లు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అందంటున్నారు నిపుణులు.

ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే పండ్లు, కూర‌గాయ‌లు, ప‌ప్పుధాన్యాలు, న‌ట్స్‌, బీన్స్ వంటివి తరుచూ తినాలి.

ఫైబ‌ర్ అధికంగా ఉండే ఆహార ప‌దార్ధాల‌ను త‌ర‌చూ తీసుకోవడం వల్ల పేగుల్లో ఆరోగ్య‌క‌ర బ్యాక్టీరియా పెరుగుతుంది.

ఈ ఆహార‌ప‌దార్ధాల‌తో పాటు త‌గినంత నీరు తీసుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌కం తలెత్తకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

పేగుల ఆరోగ్యం కోసం పెరుగు, మ‌జ్జిగ వంటి పులిసిన ఆహారల‌ను తీసుకోవాలి. మితాహారంతో పాటు త‌గినంత శారీర‌క వ్యాయామం చేయ‌డం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.