బాలింతలు ముఖ్యంగా చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..

TV9 Telugu

16 January 2024

ఒకప్పుటి కాలంలో ఎవరు కూడా పురిటి గదిలోకి ఎవరూ వెళ్లేవారు కాదు. పసిబిడ్డను ముట్టుకునేవాళ్లు కూడా కాదు.

ప్రస్తుతం అందరూ తల్లీబిడ్డలను తాకుతున్నారు. దీనివల్ల వీళ్లు జబ్బుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ప్రసవం తర్వాత సాధారణంగానే బాలింతలకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. తలకు గుడ్డలాంటివి కట్టుకోవడం ద్వారా చల్లగాలి సోకకుండా జాగ్రత్తపడాలి.

ఈ సమయంలో న్యుమోనియాలాంటివి సోకితే చాలా ప్రమాదం. బాలింతలు కాచి చల్లార్చిన నీళ్లే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

నీళ్లు ఎక్కువ తాగితే పొట్ట వస్తుందన్న అపోహపడకుండా తాగాల్సినన్ని నీళ్లు తాగాలి. కాచి చల్లార్చినవే కాదు, శుభ్రమైన నీళ్లూ ఎక్కువగా తాగుతూ ఉండాలి.

ఆరువారాల లోపు పసిబిడ్డను నిరంతరం వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నించాలి. పెద్దవారికి భిన్నంగా పసిపిల్లల్లో శరీరంలో ఉండే బ్రౌన్‌ ఫ్యాట్‌ త్వరగా కరిగిపోతుంది.

చలి వాతావరణానికి లోనైతే శరీరం త్వరగా చల్లబడిపోయే హైపోథార్మియా అనే ప్రమాదకర పరిస్థితి తలెత్తవచ్చు.

అందుకే ఈ సమయంలో గోరువెచ్చని నీళ్లలో వస్త్రాన్ని ముంచి ఒళ్లు తుడిస్తే చాలని అంటున్నారు వైద్యులు, నిపుణలు.

చలిగాలికి ఎక్కువగా తిప్పకూడదు. ఎండ వచ్చాకే స్నానం చేయించాలి. మూత్రం పోసుకుంటే వెంటనే డైపర్‌ మార్చాలి.