నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఉంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
21 October 2023
ఉపవాసంలో ఆధ్యాత్మిక పద్దతులు పాటిస్తూనే అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించాలి.
చాలా మంది ఉపవాసం అనంతరం అతిగా తింటుంటారు. కానీ అలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది.
మీరు ఎప్పుడు ఉపవాసం అనంతరం ముఖ్యంగా పేగుల ఆరోగ్యం పెంపొందించే ఆహారం తీసుకోవడానికి ముందే ప్రిపేర్ కావాలి.
ఉపవాసం తరువాత ఆహారం విషయంలో పొరపాట్ల కారణంగా చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
ఉపవాసం అయ్యాక సాబుదానా, పల్లీలు, పండ్లకు బదులుగా ప్రత్యామ్నాయాలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువమంది సాబుదానా కిచిడీ తింటుంటారు. ఇందులో తక్షణ శక్తిని అందించే పోషకాలున్నా ఫైబర్ పరిమితంగా ఉంటుంది.
ఫైబర్ పరిమితంగా ఉండి, క్యాలరీలు అధికంగా ఉండే సాబుదానా బదులు ఊదలతో చేసిన కిచిడీ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.
ఇక కొవ్వు అధికంగా ఉండే పల్లీలకు బదులుగా బాదం పప్పును వంటకాల్లో వాడితే శక్తితో పాటు ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ దొరుకుతుంది.
ఉపవాసం అవగానే ఖాళీ కడుపుతో పండ్లను తీసుకునే బదులు తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రొటీన్లతో కూడిన గ్రనోలా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే మేలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి