ఈ సమస్యలు ఉన్నవారు కలబందకు దూరంగా ఉండాల్సిందే.. 

TV9 Telugu

11 July 2024

తరుచు కలబందను తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జుట్టు చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.

అయితే, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కలబందను తినకూడదని ఆరోగ్య నిపుణులు, వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు.

గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు కలబందను తినకూడదు. దీన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.

గర్భిణీ స్త్రీలు కూడా కలబంద తినొద్దు. తింటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

కలబందను అధిక వినియోగం శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది హృదయ స్పందన సమస్యలను కలిగిస్తుంది.

ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కలబందను తీసుకోకూడదు. దీన్ని తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

కలబంద తీసుకోవడం వల్ల తక్కువ రక్తపోటు సమస్యలు పెరుగుతాయి. తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు కలబందను తినకూడదు.

నరాల బలహీనత సమస్య ఉన్నవారు కూడా కలబంద ఉపయోగించవద్దు. దీంతో సమస్య జటిలం అవుతుందన్నది ఆరోగ్య నిపుణుల మాట.