ఈ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి జోలికి వెళ్ళకండి..

TV9 Telugu

04 February  2024

జీర్ణక్రియ సమస్యలు, కొలెస్ట్రాల్‌ తగ్గించడం, క్యాన్సర్ కణాలను నాశనం చేసే వంటి గుణలు వెల్లుల్లిలో ఉంటాయి.

డయాబెటీస్ ను కంట్రోల్ చేయడం, కాలేయాన్ని రక్షించడం, శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా వెళ్ళిల్లి పెంచుతుంది.

వెల్లుల్లి అనేది అందరికీ మేలు చేస్తుందని చెప్పలేం. కొందరు వెల్లుల్లి తినకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వీలైనంత వరకూ వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

హెపటైటిస్ ఉన్నవారు వెల్లుల్లి తినకపోవడమే మంచిది. వెల్లుల్లి తింటే హెపటైటిస్ రోగుల్లో వికారం లక్షణాలు పెరుగుతాయి. రక్త హీనతకు దారి తీస్తుంది.

అదే విధంగా డయేరియాతో బాధపడేవారు సైతం వెల్లుల్లిని తినకూడదు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు సైతం వెల్లుల్లికి దూరంగా ఉండాలి.

గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా వెల్లుల్లిని తక్కువగా తినాలి. రక్త పోటు సమస్య ఉన్నవారు వెల్లుల్లిని దూరం పెట్టాలి.

ఎక్కువగా చెమట పట్టేవారు కూడా వెల్లుల్లిని తినకపోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు పోషకాహార నిపుణులు.