డయాబెటిస్‌ ఉన్నవారు కూడా రైస్‌ను రెండు పూటలా తినొచ్చు..

28 October 2023

తెల్లటి అన్నంలో వంద శాతం గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఉంటుంది. అయితే రైస్‌కి కొన్నిటిని జోడించి తింటే సమస్య ఉండదట.

రైస్‌ను మధుమేహులు కూడా రెండు పూటలా తినొచ్చని అధ్యయనం చేసిన యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూటిషియన్లు అంటున్నారు.

రైస్‌కి వెనిగర్‌ కలిపి సూషీలా వండుకుంటే జీఐ ప్రభావం గణనీయంగా తగ్గుతుందట. దీని వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయట.

అలాగే రైస్‌కి పాలను చేర్చడం వల్ల మంచి ప్రోటీన్‌ లభించడమే కాదు గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా తగ్గుతుందట.

సోయాబీన్‌ లేదా సోయా ఉత్పత్తులతో కలిపి అన్నం తీసుకుంటే గ్లైసెమిక్‌ సూచిక తగ్గి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది.

నిమ్మరసాన్ని అన్నానికి జోడించడం వల్ల కూడా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ప్రభావం 40 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.

పులియబెట్టిన పదార్థాలను రైస్‌కి జోడించడం వల్ల కూడా గ్లూకోజ్‌ స్థాయిలు తక్కువగానే ఉంటాయట. ఉదాహరణకు పెరుగు మంచి ఎంపిక.

వెనిగర్‌తో తయారుచేసిన పచ్చళ్లు, సాస్‌లు, అలాగే మిక్స్‌డ్‌ కూరగాయల సలాడ్‌లు అన్నంతో పాటు తీసుకుంటే మంచిదని అంటున్నారు.