పీపుల్ చెట్టు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్..
TV9 Telugu
22 July 2024
ఆయుర్వేదంలో మధుమేహాన్ని తగ్గించడంలో రావి చెట్టు బెరడు బాగా పనిచేస్తుంది. ఈ బెరడులో యాంటీ-డయాబెటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఇవి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధిస్తాయి. రావిబెరడును నీటిలో మరిగించి.. చల్లారిన తర్వాత తాగాలి.
రావి చెట్టు బెరడును పొడి చేసి.. ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగినా షుగర్ వ్యాధి తగ్గుతుంది.
అధిక రక్త పోటును తగ్గించేందుకు కూడా రావిబెరడును ఉపయోగిస్తారు. హైపర్ టెన్షన్ వంటి వ్యాధులకు రావి బెరడు చక్కగా పనిచేస్తుంది.
రావి బెరడును క్రమం తప్పకుండా ఉపయోగిస్తే హైబీపీ తగ్గుతుంది. ధమనుల అడ్డంకిని తగ్గించడంలో సహాయపడుతుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. అనేక రోగాలు చుట్టుముడతాయి. యాసిడ్‌ను నియంత్రించడానికి రావి బెరడు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రావి బెరడును నీటిలో మరిగించి డికాక్షన్ తయారు చేసుకోవాలి. ఈ డికాషన్ ను ఉదయం, సాయంత్రం అరకప్పుమోతాదులో తాగితే.. యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
1 గ్లాసు నీటిలో 2 నుండి 3 రావి బెరడులను వేసి ఉడికించి గోరువెచ్చగా నోటిలో పోసుకుని పుక్కలిస్తే దగ్గు తగ్గుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి