ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ రోగులు
TV9 Telugu
06 February 2024
ఇటీవల WHO క్యాన్సర్ ఏజెన్సీ, అంతర్జాతీయ (IARC) క్యాన్సర్ పరిశోధనపై ప్రపంచ వ్యాప్తంగా స్థితిగతులకు సంబంధించి తాజా రిపోర్టు విడుదల.
మొత్తం 115 దేశాలలో జరిపిన సర్వే ఫలితాల ప్రకారం, చాలా దేశాల్లో, క్యాన్సర్ రోగులకు తగినంత ఖర్చు చేయడం లేదు.
2022లో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల కొత్త కేన్సర్ కేసులు నమోదు. కేన్సర్ కారణంగానే 97 లక్షల మంది మృతి చెందినట్లు పేర్కొన్న నివేదిక.
WHO ప్రకారం ఒక్క భారతదేశంలోనే 14 లక్షల 13 వేల 316 కొత్త క్యాన్సర్ కేసులు. వీరిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువ.
2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 6,91,178 మంది పురుషులు, మహిళలు 7,22,138 మంది క్యాన్సర్ బారిన పడ్డారు.
1,92,020 కొత్త కేసులతో భారతదేశంలో అత్యధిక బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఉన్నట్లు చెబుతున్న WHO నివేదిక.
1,43,759 కొత్త నోటి కేన్సర్ కేసులు నమోదు. ఇది మొత్తం రోగులలో 10.2 శాతం. 1,27,526 మంది గర్భాశయ కేస్సర్ రోగులు. ఇది మొత్తం కేసులలో 9 శాతం.
భారతదేశంలో 81,748 మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇది మొత్తం కేసులలో 5.8 శాతం. 70,637 కొత్త అన్నవాహిక క్యాన్సర్ కేసులు. ఇది 5.5 శాతం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి