ఈ సమస్యలు ఉన్నవారికి ఉల్లితో ప్రమాదం..
TV9 Telugu
15 August 2024
అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఉల్లిపాయను కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదంటున్నారు పోషకాహార నిపుణులు.
ఎవరైనా హైపో గ్లైసీమియా అంటే.. షుగర్ లెవల్స్ తక్కువగా ఉండే సమస్యతో ఇబ్బంది పడేవారు ఉల్లిపాయను తినడకూడదట.
వీరు ఉల్లిపాయ తినడం వల్ల షుగర్ లెవల్స్ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉందట. ఇంకా శరీరంలో విటమిన్ కె అధికంగా ఉన్నవారు ఉల్లిపాయను తక్కువ తీసుకోవాలట.
ఉల్లిలో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని గడ్డ కట్టెలా చేస్తుందట. కనుక శరీరం లోపల రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవారు ఉల్లిపాయకు దూరంగా ఉండాలి.
లేదంటే హార్ట్ ఎటాక్ సమస్య తలెత్తవచ్చంటున్నారు. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నవారు ఉల్లిపాయను పక్కకు పెట్టడం మంచిది.
హృదయ సంబంధ సమస్యలతో ఉన్నవారు కూడా ఉల్లిపాయలకు దూరంగా ఉండడం మంచిది. లేదా మొత్తానికి ఉల్లిపాయను తినడం మానేయడం కూడా మేలు చేస్తుంది.
ఎందుకంటే ఉల్లిపాయలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గర్భణీలు కట్ చేసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలను అస్సలు తినకూడదట.
పచ్చి ఉల్లిపాయను తింటే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అందుకే ఉల్లిపాయ మోతాదులో తినాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి