గంగిగోవు పాలతోనే కాదు.. ఖరము పాలతోనూ మేలు..
TV9 Telugu
16 March 2025
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు.. అనే పద్యం చెదివే ఉంటారు. అయితే ఇప్పుడు గాడిద పాలు కూడా మేలు అంటున్నాయి నివేదికలు.
గాడిద పాలు పోషకాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా చిన్నారుల్లో వచ్చే ఉబ్బసం, ఆస్తమా వంటి సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతంది.
ఇక గాడిద రోజుకు కేవలం లీటర్ పాలు మాత్రమే ఇస్తుంది అందుకే వీటికి అంత డిమాండ్ ఉంటుంది. అలాగే గాడిద పాలను సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు.
గాడిద పాలలో విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుంది. దీంతో అర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి గాడిదల పాలు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.
ఇక గాడిద పాలలో ఉండే మంచి గుణాలు దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్లతోపాటు గాయాలకు చికిత్స చేసేందుకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
దురద, తామర వంటి చర్మ సంబంధిత సమస్యలకు సైతం గాడిద పాలు దిద్యౌషధంగా ఉపయోగపడాతయని నిపుణులు చెబుతున్నారు.
ఇక గాడిద పాలతో ఫెయిర్‌నెస్ క్రీమ్, షాంపూ, లిప్‌బామ్, బాడీవాష్... వంటి కాస్మెటిక్స్ తయారుచేస్తుంటారు అందుకే వీటికి అంత డిమాండ్ ఉంటుంది.
మెరుగైన జీర్ణక్రియను అందించడంలోనూ గాడిద పాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
వేసవిలో ఈ మంచు ప్రాంతాలు భూతల స్వర్గం.. ఒక్కసారైన చూడాలి..
ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా 100కుపైగా టీవీ ఛానెల్‌లు
ప్రపంచంలోని సొంత సైన్యం లేని దేశాలు ఇవే..!