పెడిక్యూర్ ఇంట్లోనే చేసుకొండిలా..
13 October 2023
పెడిక్యూర్ కోసం ప్రత్యకంగా పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు, సింపుల్‌గా ఇంట్లోనే పండ్ల తొక్కలతో చేసుకోండిలా..
పెడిక్యూర్ కోసం ఏవి ఉపయాగించాలో.. ఎలా చేస్తే మీ పాదాలు మెరుస్తాయో అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పాదాలను మెరిపించడంలో అరటిపండు తొక్కలు చక్కగా పనిచేస్తాయి. అందుకే వీటిని బయట బయట పడేయకుండా పక్కన ఉంచండి.
పెడిక్యూర్ కోసం ముందుగా అరటి పండు తొక్కలను ముక్కలుగా తరిగి కొద్దిగా తేనె వేసి మిక్సీలో పేస్ట్ చేయాలి.
అరటితొక్కల పేస్టులో కాఫీ పొడి కూడా కలిపి స్క్రబ్బర్‌లా పాదాలపై పదిహేను నిమిషాలు రుద్దాలి. మురికి, మలినాలు పోయి చక్కగా మెరుస్తాయి.
ఆ తర్వాత పేస్ట్‌కి కొద్దిగా అలోవెరా జెల్ కలిపి ఈ పేస్టుని పాదాలకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.
ఇలా వారానికి రెండుసార్లు పెడిక్యూర్ చేయడం వల్ల పాదాలకు తేమను అందించి కోమలంగా మృదువుగా మారడంతో పాటు చక్కగా మెరుస్తాయి.
ఇంకేందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ఇలా ఇంట్లో పెడిక్యూర్ ప్రయత్నించండి. మీ పాదాలను అందంగా కోమలంగా మార్చుకోండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి