ఆవాలతో ఆ సమస్యలకు బై బై..

TV9 Telugu

07 July 2024

చల్లదనంతో కీళ్లు బిగదీసుకుపోయి నొప్పిని కలిగించిన సందర్భాల్లో ఆవాలు వాతాన్ని క్రమ పద్దతిలోకి తీసుకువస్తుంది. నొప్పిని, వాపుని నిరోధిస్తాయి.

వీటిలో ఉండే పోషకాలు మనకు వ్యాధులు రాకుండా కాపాడి వ్యాధి నిరోధకతను పెంచుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆవాలను తింటే మంచి ప్రయోజనం లభిస్తుందని అంటున్నారు.

ఆవాల్లో ఉండే కాపర్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియంలు హైబీపీని తగ్గిస్తాయి. దింతో రక్తపోటు అదుపులో ఉంటుంది.

వీటిల్లో ఉండే మ్యూసిలేజ్‌ అనే చిక్కటి పదార్థం విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది.

ఫంగస్, ఇతర చర్మ ఇన్ ఫెక్షన్లు ఉన్నవారు ఆవాలను తినడం ద్వారా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు.

ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను గుర్తించి నాశనం చేస్తుంది. దీంతో ముప్పు తగ్గుతుంది.

ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఎదుగుదలకు, సమస్యలు నివారించడంలో దోహదపడుతుంది.