కర్బూజతో ఆ సమస్యలన్నీ దూరం..
28 September 2024
TV9 Telugu
కర్బూజ విటమిన్ సికి పెట్టింది పేరు. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వ్యాధుల బారిన పడడం తగ్గుతుంది.
ఇక కర్బూజలో యాంటీ ఆక్సిడెంట్స్‌తో శరీరంలో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుంది.
రక్తపోటుతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
ఫైబర్‌కు మస్క్ మలాన్ పెట్టింది పేరు. ఇందులోని ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇక మస్క్ మలన్‌లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. ఇది త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.
కర్బూజలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా కర్బూజ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారి, నొప్పులు తగ్గుతాయి.
కర్బూజలోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మస్క్ మలన్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి సమస్యలు దరిచేరవు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి