మునకాకుతో ఇలా చేస్తే జట్టు సమస్యలన్నీ దూరం.. 

TV9 Telugu

17 July 2024

మునగ ఆకులు మీ జట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. ఈ ఆకుల్లో ఉంటే విటమిన్ సి.. మీ తలకు చాలా మేలు చేస్తుంది.

విటమిన్ సి కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. అలాగే జుట్టు మూలాలను బలపరుస్తుంది.

మునగ ఆకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లను కలిగి ఉంటుంది. అలాగే జుట్టుకు సహజంగా తేమను అందిస్తుందని అంటున్నారు నిపుణులు.

మునగ ఆకుల్లో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టు కనాలను బలపరుస్తుంది. కాబట్టి జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

హెయిర్ ప్యాక్ కోసం రెండు చెంచాల మునగ ఆకు పౌడర్ కి, రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను కలపండి.

దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. దీన్ని గంటసేపు అలాగే ఉంచి ఆరిపోయిన తర్వాత షాంపూతో తలస్నానం చెయ్యండి.

ఇలా వారానికి ఒక్కసారైనా ఈ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు రాలడం తగ్గిపోవడమే కాకుండా ఒత్తుగా నిగనిగలాడుతూ ఉంటుంది.

మునగాకు నుంచి తయారు చేసిన ఆయిల్ జుట్టుకు అప్లై చేస్తే చాలా మేలు చేస్తుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.