ఈ అలవాట్లే కారణమా? లైఫ్ బిందాస్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
09 April 2024
Shaik Madar Saheb
చాలా మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏదో ఒక విషయంలో నిరాశతో తీవ్ర భావోద్వేగానికి లోనవుతుంటారు..
ఒత్తిడి, కోపం.. లాంటివి మానసిక సమస్యలను కలిగిస్తాయి. దీంతో మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది.. క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
అందరినీ మెప్పించడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరి అవసరాలు అన్ని సమయాల్లో భిన్నంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
కొన్ని అలవాట్లను మెరుగుపర్చుకుంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది.. దీంతో మీరు ఎల్లప్పుడూ ఖుషీగా ఉండవచ్చు..
నో చెప్పడం నేర్చుకోండి.. ఇతరులు బాధపడకుండా ఉండటానికి మీరు ఏ పనికైనా, ఏ విషయంలోనైనా నో చెప్పలేకపోతే మీరే ఇబ్బందిపడతారు
ముందుగా మీ ప్రాధాన్యతలను అర్థం చేసుకోండి.. ఎదుటివారి కంటే ఎప్పుడూ మీ గురించే ఆలోచించాలి.
ప్రతిదానిపై పరిమితులను విధించుకోండి.. మీ సామర్థ్యానికి మించి పనిచేయడం మానుకోండి, లేకపోతే నొప్పి పెరుగుతుంది.
అందరినీ మెప్పించడం సాధ్యం కాదు.. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే లైఫ్ బిందాస్ గా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..