02 March 2024

స్పెర్మ్ కౌంట్ పెరగడానికి  ఏం చేయాలి ??

TV9 Telugu

ప్రస్తుత కాలంలో చాలా మంది మగవారు స్పెర్మ్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వీర్యకణాల ఉత్పత్తి తక్కువైతే సంతాన సమస్యలను ఏర్పడతాయి.

వీర్యకణాల సంబంధిత సమస్యలను తగ్గాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని ఆహార పదార్ధాలను మీ రోజువారి డైట్ లో చేర్చుకోవాలి.

మీరు స్పెర్మ్ కౌంట్ సమస్యతో హాస్పటల్ కు వెళ్లి ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఖచ్చితంగా హెల్తీ డైట్‌ను  తీసుకోవాల్సి ఉంటుంది.

వీర్యకణాల వృద్ధి కొరకు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ టెస్టోస్టెరాన్ స్థాయిలు స్థాయిలను పెంచుతుంది.

వ్యాయామం చేసేవారిలో మెరుగైన వీర్య కణాలు కూడా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలేయాయి. అలా అని  మరీ ఎక్కువ వ్యాయామాలను చేయకూడదు.

జింక్ కూడా సంతానోత్పత్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది.  వీర్యకణాల వృద్ధి మెరుగుపరచాలనుకుంటే మీరు  ఆహారంలో జింక్ ఉండేలా చూసుకోండి. 

 విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్నవారికి లైంగిక సంతృప్తిని తగ్గి సంతానోత్పత్తిని కూడా దెబ్బతీస్తుంది.. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. 

విటమిన్ డి టెస్టోస్టెరాన్ స్థాయిలను బాగా పెంచుతుంది. విటమిన్ డి లెవెల్స్ ఎక్కువగా ఉంటే స్పెర్మ్ చలనశీలత బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.