డార్క్ చాక్లెట్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

TV9 Telugu

11 JULY 2024

చిన్నవారి నుండి పెద్ద వారి దాకా చాక్లెట్ ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అయితే చాక్లెట్ రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. 

చాక్లెట్  మితిమీరి తింటే అనారోగ్యానికి దారితీస్తుంది. తగిన మోతాదులో తినాలి.  అయితే డార్క్ చాక్లెట్ తినడం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అధిక ఒత్తిడిని తగ్గించండంలో అద్భుతంగా ఉపయోగ పడతాయి.

యాంటీ ఆక్సిండెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కాన్సర్, వాపు వంటి అనేక సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి.

డార్క్ చాక్లెట్ తినడం వల్లన గుండెకు చాలా మంచిది. డార్క్ చాక్లెట్‌లో ఉండే పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ప్రెగ్నెంట్ సమయంలో 30 గ్రాములు డార్క్ చాక్లెట్ తినడం వల్ల పిండం ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే ప్లెవనాయిడ్స్ యూవీ కిరణాల నుండి రక్షణనిస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.