బ్లూబెర్రీలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
18 December 2023
బ్లూబెర్రీ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అధ్యయనకారులు గుర్తించారు.
తరచూ బ్లూబెర్రీ పండ్లను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని పరిశోధన నివేదికలు వెల్లడిస్తున్నాయి.
బ్లూబెర్రీ పండ్లు తింటే నాడుల క్షీణతకు సంబంధించిన అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి.
మెదడులో విషపూరిత ప్రొటీన్లు పేరుకుపోకుండా బ్లూబెర్రీ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయని నిపుణులు మాట.
ప్రతీరోజూ బ్లూబెర్రీ తినడం వల్ల వయసు పైబడటం, మేథా సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్య నుంచి బయటపడేస్తుంది.
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు తీసుకునే వారి మేథా సామర్థ్యం తగ్గుదల రెండున్నరేళ్లు వాయిదా పడుతుందని తేలింది.
తరుచూ బ్లూబెర్రీ పండ్లను తాజాగా తిన్నా, ఫ్రిజ్‌లో ఉంచి తిన్నా కూడా ఒకే రకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధమైన బ్లూబెర్రీ టీ కూడా ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి