సంక్రాంతి వేళ దొరికే రేగు పండ్లతో అనేక ప్రయోజనాలు..
TV9 Telugu
13 January 2024
ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వస్తూనే రేగు పండ్లను వెంటేసుకుని వస్తుంది. రేగు పండ్లు లేనిదే పండగ జరగదు.
సంక్రాంతి సీజన్‌లో విరివిగా దొరికే రేగు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు అందుతాయి.
శరీరంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు రేగు పండ్ల ద్వారా చెక్ పెట్టొచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.
రేగు పండ్లు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు ఏ మాత్రం ఆలోచించకుండా రేగు పండ్లు తినొచ్చని డాక్టర్లు చెబుతారు
రక్త హీనత సమస్య ఉన్నారు, ఐరన్ లోపం ఉన్న వారు రేగు పండ్లను తింటే ఆ సమస్యలు దూరం అవుతాయని నిపుణుల మాట.
రేగు పండ్లు తింటే ఎముకలు, దంతాలు కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. చిన్న పిల్లలు, వయసు మీద పడినవారికి పెడితే వారి ఎముకలు గట్టి పడతాయి.
రేగు పండ్లు తింటే చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. చర్మంపై దద్దుర్లు, దురదలు రావు. పొడిబారిన, నిర్జీవంగా ఉన్న చర్మం కాంతివంతంగా మారుతుంది.
జీర్ణ సమస్యలతో బాధపడేవారు రేగు పండ్లు తీసుకుంటే మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా రేగు పండ్లు తీసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి