మొలకెత్తిన గింజలు తింటే అనేక లాభాలు..

TV9 Telugu

20 August 2024

పోషకాలు సమృద్ధిగా అందాలంటే ప్రతిరోజూ కాసిన్ని మొలకెత్తిన గింజలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మొలకెత్తిన గింజల్లో విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లతో పాటు ఫైబర్‌, ప్రొటీన్స్‌, ఎంజైమ్స్‌ పుష్కలంగా ఉంటాయి.

మొలకల్లో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండి, విటమిన్‌ సి, ఫోలేట్‌, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారు రోజూ గుప్పెడు మొలకలు తీసుకుంటే స్వల్పకాలంలో అద్భుత ఫలితాలు చూస్తారు. జీర్ణక్రియ మరింత సాఫీగా సాగేలా సాయపడుతుంది.

మొలకల్లో జింక్‌, ఇనుము, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలం. ఈ పోషకాలు శరీరంలోని అన్ని అవయవాలకూ.. ఆక్సిజన్‌ను సక్రమంగా అందేలా చూస్తాయి.

సంతాన సాఫల్య సమస్యల్ని దూరం చేయడంలో మొలకెత్తిన గింజల్లో ఉండే జింక్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.

మలబద్ధక సమస్యతో బాధపడే వ్యక్తులు వారి డైట్‌లో మొలకెత్తిన గింజలు ప్లాన్‌ చేసుకుంటే సమస్య దూరం అవుతుంది.

హార్మోన్‌ అసమతుల్యతతో బాధపడుతున్నట్లయితే పెసర్లు, రాగులు, బొబ్బర్లు, రాజ్మా వంటివన్నీ కలగలిపి తీసుకోవాలి.