తేనె ఎప్పుడు తినాలో తెలుసా..? ఆ సమయంలో సేవిస్తే తిరుగుండదంట..

TV9 Telugu

07 April 2024

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ జాగింగ్‌, వాకింగ్‌, వ్యాయామం, యోగా ఇలా ఎన్నో చేయడం చూస్తున్నాం.

కొంచెం కష్టమే అయినా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. తేనె తీసుకుంటే మంచిదని అందరికీ తెలిసిందే.

అయితే అధిక ఆరోగ్యం ప్రయోజనాలు పొందాలంటే తేనెను ఓ ప్రత్యేక సమయంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రిపూట తేనె తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు. రాత్రిపూట తేనె తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.

తేనెలో మెలటోనిన్ ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడే హార్మోన్‌. అలాగే దగ్గు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

తేనెలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మెదడును శక్తివంతంగా కూడా ఉంచుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు తేనె సహాయపడుతూంది. దీన్ని తీసుకొంటే డయాబెటిస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

తేనె గుండె జబ్బులను నివారిస్తుంది. రక్తపోటును తగ్గించడంలో, మీ హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది.