మెంతి గింజల్లో అనేక పోషక లక్షణాలు ఉన్నాయి. అవి సూపర్ ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి. మీరు మెంతి గింజలను క్రమంగా ఉపయోగిస్తే బరువు సులువుగా తగ్గుతుంది.
మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా జీర్ణ శక్తిని పెరిగి శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. దీనివల్ల డయాబెటిస్, షుగర్ రోగులకు చాలా ఉపయోగం కలుగుతుంది.
మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొటిమలను తగ్గించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఛాయను తేలికపరుచి సహజమైన కాంతిని ఇస్తుంది.
మెంతి నీరు మంటను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, ఆస్తమా వంటి వాపు సంబంధిత పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తక్కువ కేలరీల టీ తాగాలనుకుంటే మెంతి టీ ఉత్తమం. ఈ టీ ప్రత్యేకత ఏమిటంటే బెల్లీ ఫ్యాట్ (బొడ్డు చుట్టూ కొవ్వు) ను తగ్గించే గుణాలు ఉన్నాయి.
మెంతి టీ తాయారు చేసికోవడం కోసం ఒక చెంచా మెంతులు, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం నీటిలో వేసి మరిగించి తాగాలి.
ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఫ్యాట్ బర్న్ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ప్రతిరోజూ తాగితే బరువు కూడా తగ్గవచ్చు.