TV9 Telugu

ఈ ఫుడ్ కాంబినేష‌న్స్‌తో కొవ్వును ఇట్టే క‌రిగిద్దాం..!

18 Febraury 2024

బ‌రువు త‌గ్గడం అంత ఈజీ ప్ర‌క్రియ ఏం కాదు. ఆరోగ్య‌క‌ర ఆహారంతో పాటు వ్యాయామంతో ఇది సాధ్యమే అంటున్నారు నిపుణులు

ప‌లు ర‌కాల ఫుడ్ కాంబినేష‌న్స్‌తో అనుకున్న ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు. ఆహారంలో కెలొరీలకు సమానంగా ప్రొటీన్‌ ఉండేలా చూడటమే బేసిక్‌ థంబ్‌ రూల్‌

నిర్ధిష్ట ఆహార ప‌దార్ధాల‌ మేళ‌వింపు బ‌రువు త‌గ్గే ప్ర‌క్రియ‌లో అద్భుత సాధ‌నంగా ప‌నిచేస్తుంది. మన సంస్కృతిలో భాగమైన థాలీ పోషకాల అవసరాన్ని తీర్చుతుంది.

మ‌నం ఎలాంటి ఆహారం తీసుకున్నామ‌నే దానిపై మ‌న శ‌రీరం వాటి నుంచి పోష‌కాల‌ను సంగ్ర‌హించి జీర్ణ‌క్రియ స‌జావుగా సాగేలా చేస్తుంది.

బ‌రువు పెర‌గ‌డం, బ‌రువు తగ్గ‌డం వంటి వాటిని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించే హార్మోన్ల‌ను ఈ విభిన్న ఫుడ్ కాంబినేష‌న్స్ నియంత్రిస్తాయి.

శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డం కోసం రోజూ అరగంట నడక, యోగా లేదా జిమ్‌లో వ్యాయామం ఎంతగానో సహకరిస్తుంది.

ఈ ఫుడ్ కాంబినేష‌న్స్‌తో పొట్ట‌లో కొవ్వును కూడా ఇట్టే క‌రిగించేయ‌వ‌చ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.

పెప్ప‌ర్‌తో పొటాటో, దాల్చిన చెక్క‌తో కాఫీ, సాస్‌తో చ‌నా, రైస్‌తో బ‌ఠాణీలు, హెల్ధీ ఫ్యాట్స్‌తో పండ్లు, కూర‌గాయ‌లు కొవ్వును త్వరగా కరిగిస్తాయి.