నిమ్మ ఆకులతో లాభాలు బోలెడు..! ఔషధ గుణాలు తెలిస్తే షాక్‌ అవుతారు..!

Jyothi Gadda

24 August 2024

నిమ్మ ఆకుల గురించి చాలామందికి తెలియదు. నిమ్మ ఆకులు కేవలం చెట్టుకు అలంకారంగా ఉండవు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అనేక రకాల వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

నిమ్మ ఆకులతో వైద్యం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా నలుపు మచ్చలు తొలగించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. జుట్టుకు మెరుపునిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధిస్తుంది. నిమ్మ ఆకులను నీటిలో మరిగించి చాయ్ లాగా తాగవచ్చు. కషాయంలా కూడా తీసుకోవచ్చు.

ఈ టీ గొంతునొప్పి, ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తుంది. నిమ్మ ఆకుల్లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి1 తగినంత పరిమాణంలో లభిస్తాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 

మైగ్రేన్‌తో బాధపడేవారికి నిమ్మ ఆకులు మేలు చేస్తాయి. నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఈ గుణాలు, శరీరంలోని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గించి మ్రైగేన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

చిన్న పిల్లలకు కడుపు లో నులి పురుగులు ఉన్నప్పుడు స్పూన్ నిమ్మ ఆకుల రసం ఉపయోగపడుతుంది. ఇందులో తేనె కలిపి ఐదు నుంచి పది రోజుల పాటు తాగడం వల్ల  నులి పురుగుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

హెర్బల్ టీ కోసం నిమ్మ ఆకులను వాడవచ్చు. తాజా ఆకులు లేదా నిమ్మకాయల పొడితో ఈ టీని తయారు చేయవచ్చు. నీటిలో ఆకులను లేదా ఆకుల పొడిని వేసి మూడు నిమిషాల పాటు స్టవ్ మీద మరిగించండి. 

తర్వాత దాన్ని వడకట్టి తాగేయండి. మీరు ఇష్టమైతే కొద్దిగా తేనె కలిపి కూడా తాగవచ్చు. తాగిన తర్వాత మీకు ఎంతో తాజాగా అనిపిస్తుంది. నిమ్మ ఆకుల రసం, తేనె కలిపి ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.