డయాబెటిస్‌తో లైఫ్ స్పాన్ తగ్గుతుందా.. లాన్సెట్ ఏమి చెబుతుందంటే..
05 October 2023
డయాబెటిస్‌తో తగ్గుతున్న లైఫ్ స్పాన్.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన లాన్సెట్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
30 ఏళ్ల వయసులో టైప్-2 మధుమేహం వస్తే...సగటు ఆయుర్దాయం 14 ఏళ్ల వరకు తగ్గుతుంది. అందుకే దీనిపట్ల జాగ్రత్త వహించండి.
40 ఏళ్ల వయసులో డయాబెటిస్ వ్యాధికి గురైతే పదేళ్లు, 50 ఏళ్లప్పుడు వస్తే ఆరు సంవత్సరాల ముందే చనిపోతారట.
19 దేశాల్లోని 15 లక్షల మంది ప్రజల సమాచారాన్ని విశ్లేషించి డయాబెటిస్ విషయంలో ఈ నిర్ధారణకు వచ్చారు సైంటిస్ట్‌లు.
ఊబకాయం, ఫాస్ట్ ఫుడ్స్, అధిక సమయం కూర్చునే ఉండడం, వ్యాయామం లేకపోవడం వంటివి మధుమేహం భారిన పడడానికి కారణాలు.
యువత టైప్-2 డయాబెటిస్ పై అవగాహన పెంచుకోవాలి, నివారణా మార్గాలు అనుసరించాలి. ఇలా చేయడం వల్ల సమస్య వచ్చే ప్రమాదం తగ్గుంది.
సాధ్యమైనంత వరకు టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి దూరంగా ఉండటం పై అవగాహన కలిగి ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
దీంతో టైప్ 2 డయాబెటిస్ మరణాల ముప్పును తగ్గించవచ్చని లాన్సెట్ తాజాగా చేసిన సర్వే ప్రకారం సూచించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి