రాత్రిపూట తక్కువ నిద్రపోతున్నారా.. తర్వాత తరాలు ప్రమాదంలో పడినట్లే..
22 October 2023
రాత్రిపూట నిద్ర తగ్గితే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ లక్షణాలు మరో తరానికీ సంక్రమిస్తాయని బాంబు పేల్చిన యూఎస్‌సీ పరిశోధకులు.
రాత్రిపూట తరచుగా 5 గంటల కంటే తక్కువ సేపు నిద్రపోవడం వల్ల మానసిక ఒత్తిడి ముప్పు పెరుగుతుందని జన్యుపరమైన అధ్యయనంలో తెలిసింది.
నిద్రలేమి, మానసిక ఒత్తిడి లక్షణాలు ఒక తరం నుంచి మరో తరానికి పాక్షికంగా సంక్రమిస్తాయని లండన్ యూనివర్సిటీ కాలేజీ పరిశోధకులు తెలిపారు.
తక్కువ నిద్ర అనేది మానసిక ఒత్తిడి లక్షణాలతో ముడిపడి ఉంటుందని తెలిపారు. ఈ అలవాటు ఉంటె వెంటనే మార్చుకోండి.
సగటున 65 ఏళ్ల వయసున్న 7,146 మంది వ్యక్తుల నుంచి సేకరించిన జన్యు, ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి వీరు ఈ విషయాలను తేల్చారు.
స్మార్ట్ ఫోన్లు వచ్చాక చాలామంది ‘నిద్ర’ను చాలా లైట్ తీసుకుంటున్నారు. చేతులారా ఆయుష్సును తగ్గించుకుంటున్నారు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు, పరిశోధనలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఓటీటీలు, ఆన్‌లైన్ గేమ్స్ వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఫలితంగా అంతుచిక్కని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి