ప్రాణాలు తీస్తోంది.. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి..?

11 November 2023

ప్రస్తుత కాలంలో కార్డియాక్ అరెస్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గుండె కొట్టుకోవడం సడెన్‌గా ఆగిపోవడాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు.

పెరుగుతున్న కేసులు

కార్డియాక్ అరెస్ట్ అంటే హఠాత్తుగా గుండె పనితీరు కోల్పోవడం. శరీరం అంతటా రక్తాన్ని పంపింగ్ చేయడానికి బాధ్యత వహించే గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది.

కార్డియాక్ అరెస్ట్ అంటే

ఫలితంగా మెదడుకు ఆక్సిజన్ సరఫరా లోపిస్తుంది. దీని వల్ల స్పృహ కోల్పోవడం, శ్వాస కోల్పోవడం జరుగుతుంది. శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. దీనినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. 

రక్త ప్రవాహం ప్రభావితం..

గుండెపోటు - గుండె ఆగిపోవడం (హార్ట్ ఎటాక్ - కార్డియాక్ అరెస్ట్) రెండూ భిన్నంగా ఉంటాయి.. రెండూ కూడా ఎక్కువగా ప్రభావం చూపుతాయి.

హార్ట్ ఎటాక్ - కార్డియాక్ అరెస్ట్

గుండెపోటు అనేది రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. గుండె ఆగిపోవడం అనేది గుండె రక్తాన్ని పంపింగ్ చేసే పనిని అకస్మాత్తుగా ఆపివేయడం. 

గుండెపోటు- గుండె ఆగిపోవడం

గుండెపోటు సమయంలో అడ్డంకులు ఉన్నప్పటికీ గుండె పంపు చేస్తూనే ఉంటుంది. దీనికి విరుద్ధంగా, కార్డియాక్ అరెస్ట్ సమయంలో గుండె రక్తాన్ని పంపింగ్ చేయడం ఆగిపోతుంది.

రెండింటి వ్యత్యాసం ఏమిటంటే? 

కార్డియాక్ అరెస్ట్.. గుండె ఆగిపోవడానికి కారణం కావచ్చు లేదా అది అకస్మాత్తుగా సంభవించవచ్చు. కార్డియాక్ అరెస్ట్ అనేది ఆకస్మికంగా వస్తుంది.  

ఆకస్మికంగా..